కరోనా నివారణకు వ్యాక్సిన్, మందు వచ్చేవరకు ఆ వైరస్‌తో జీవించడం నేర్చుకోవాలని ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కరోనాపై ప్రజలందరికీ స్పష్టమైన అవగాహన రావాల్సి ఉన్నదని పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రజల్లో జీవితమా.. జీవనోపాధా? అన్న మీమాంస ఉండటం సహేతుకం కాదని.. రెండూ ఉంటేనే అర్థవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనాకు వ్యాక్సిన్‌ను కనుక్కోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనా.. దాని ప్రభావాన్ని నిరూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం సమయం పడుతుందని.. అప్పటిదాకా కరోనాతో కలిసి బతకడం తప్పనిసరి అని చెప్పారు. కరోనా నియంత్రణలో యావత్ ప్రపంచం భారతదేశాన్ని అభినందిస్తున్నదని చెప్పారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయడం ద్వారా కొవిడ్-19ను నియంత్రించగలిగామని తెలిపారు.
రెండూ అవసరమే జీవితము.. జీవనోపాధి