సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో గత 11 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. దేశంలో కరోనా కాలు మోపినప్పటి నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లో కేవలం 41 కేసులు మాత్రమే నమోదయ్యాయని వారు తెలిపారు. ఆ 41 కేసుల్లోనూ 40 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారని, ప్రస్తుతం ఒకే ఒక్క కరోనా బాధితుడు చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. సోమవారం 247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా కేవలం 136 మందికి నెగెటివ్ రిపోర్టు వచ్చిందని, మిగతా వారి ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు.