కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డులపై రికార్డులను నమోదుచేస్తున్నది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టులోని రెండు లింకులతోపాటు తాజాగా అందుబాటులోకి రానున్న శ్రీరాజరాజేశ్వర జలాశయం- కొండపోచమ్మ సాగర్ వరకు పనుల్లో కూడా మరికొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఈ నెల 15 లోగా కొండపోచమ్మలోకి గోదావరి జలాలను తరలించాలనే లక్ష్యంతో పనులు చేపట్టడంతో ఏడు నెలల వ్యవధిలోనే 3.88 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని పూర్తిచేయడమనేది అరుదైన అంశం. కొండపోచమ్మ పూర్తి నిల్వసామర్థ్యం 15 టీఎంసీలు. ఈ జలాశయ నిర్మాణం ఏడు నెలల్లోనే పూర్తవడమం టే మాటలు కాదు. భూసేకరణకే దశాబ్దాల సమ యం గడిపిన అనుభవాల నుంచి నెలల వ్యవధిలో ఏకంగా నీటినిల్వకు జలాశయాలు సిద్ధం కావడమనేది సీఎం కేసీఆర్ కార్యదక్షతకు నిదర్శనం.