1952 నుంచి 1962 మధ్య కాలంలో ఫుట్‌బాల్ క్రీడలో ప్రపంచ దేశాలపై అద్భుత ఆధిపత్యం ప్రదిర్శించింది భారత్. ఆ సమయంలో ఆ జట్టుకి కోచ్‌గా సయ్యద్ అబ్ధుల్ రహీం ఉన్నారు. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘మైదాన్’ పేరుతో చిత్రాన్ని వెండితెరపైకి తీసుకురాబోతున్నారు బోనీ కపూర్. జీ స్టూడియోస్ సమర్పణలో రూపొందబోయే ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ‘బదాయి హో’ చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న అమిత్ రవీందర్‌నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ ఫుల్‌బాల్ కోచ్‌గా కనిపించనున్నారు. కొద్ది సేపటి క్రితం చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నవంబర్ 27,2020న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటనలో తెలిపారు. కాగా, అజయ్ దేవగణ్ రీసెంట్ తాన్హాజీ అనే చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.